UPSC సివిల్స్ – 2026 ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్… | Union Public Service Commission Civil Services Examination 2026 Prelims Results Released and check


Education Jobs

oi-Korivi Jayakumar

భారత దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోటీ పరీక్షగా భావించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2026 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. Union Public Service Commission (UPSC) తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన పీడీఎఫ్ జాబితాను ప్రకటించింది. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులు ఇప్పుడు తమ రోల్ నంబర్లను పరిశీలించుకుంటున్నారు. ప్రిలిమ్స్ ఫలితాల కోసం https://www.upsc.gov.in/sites/default/files/WR-CSP-2026-RollList-Engl-150626.pdf క్లిక్‌ చేయండి.

రికార్డు స్థాయిలో దరఖాస్తులు..

కాగా ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 8,19,372 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో దాదాపు 5.49 లక్షల మంది మే 24, 2026న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ వంటి అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో లక్షలాది మంది యువత పోటీ పడింది.

union-public-service-commission-civil-services-examination-2026-prelims-results-released

ఇక ఇప్పుడు ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశ అయిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అవకాశం పొందుతారు. యూపీఎస్సీ విడుదల చేసిన పీడీఎఫ్‌లో ఎంపికైన అభ్యర్థుల రోల్ నంబర్లను మాత్రమే పొందుపరిచింది. వ్యక్తిగత మార్కులు, కట్‌ఆఫ్ మార్కులు, అభ్యర్థుల మార్కుల వివరాలను మెయిన్స్ పరీక్ష ప్రక్రియ పూర్తయిన తర్వాత అధికారికంగా విడుదల చేయనుంది. UPSC Civil Services Examination 2026 ద్వారా మొత్తం 933 సివిల్ సర్వీసెస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంలోని పలు గ్రూప్-ఏ, గ్రూప్-బీ సర్వీసులకు నియామకాలు జరుగనున్నాయి.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFoS) ప్రిలిమ్స్ ఫలితాలు కూడా విడుదల

మరోవైపు సివిల్ సర్వీసెస్ ఫలితాలతో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFoS) ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను కూడా యూపీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల పేర్లు, రోల్ నంబర్ల జాబితాను కూడా కమిషన్ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అటవీ సేవల్లో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది కీలక దశగా నిలిచింది. 80 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

మెయిన్స్‌కు సూచనలు..

ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పుడు మెయిన్స్ పరీక్షకు పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలి. వ్యాసరచన, జనరల్ స్టడీస్, ఆప్షనల్ సబ్జెక్టులు, ప్రస్తుత వ్యవహారాలు, సమాధాన రచనా నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. మెయిన్స్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు అనంతరం వ్యక్తిత్వ పరీక్ష (ఇంటర్వ్యూ)కు ఎంపిక అవుతారు.



Source link

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *